విజయవాడ మేయర్ ఎన్నికల్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు 11,137 ఓట్లు వచ్చినట్లు సమాచారం.. మరోవైపు జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో మేయర్గా విజయం సాధించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో హోరాహోరీ ప్రచారం నిర్వహించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఫలితాల్లో తీవ్ర నిరాశ ఎదురైంది.