ప్రధాన పార్టీలకు తీసిపోని రీతిలో ప్రచారం చేపట్టిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. . విజయవాడ: నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తీసిపోని రీతిలో ప్రచారం చేపట్టిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఆయన పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం నేత బాబూరావుకు 29,333 ఓట్లు వచ్చాయి. వామపక్షాల ఓట్లు కూడా బదిలీ కాలేదని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి 1.30 గంటలకు విడుదలైన ఫలితాల్లో ఏబీవీకి 12వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.