నర్సంపేట (వరంగల్), వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బుచ్చి నాయక్ తండాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ వైష్ణవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన వాంకుడోత్ సమ్మయ్య, కమల దంపతుల పెద్ద కూతురు వైష్ణవి జబల్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో థర్డ్ ఇయర్ చదువుతుంది. సోమవారం మధ్యాహ్నం ఆమె హాస్టల్ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఫ్రెండ్స్ కు అనుమానం వచ్చింది. హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గది తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే వైష్ణవి ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది.