హనుమకొండ: కరీంనగర్ నుంచి వరంగల్‌కు 16 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సుల సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉద యం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు రాకపోకలు సాగనున్నాయి. ఈ డీలక్స్ నాన్‌స్టాప్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించదు. సాధారణ బస్సులతో పోలిస్తే డీలక్స్ నాన్ స్టాప్ సర్వీసుల్లో ప్రయాణ సమయం తగ్గనుంది.