గ్రేటర్ ఎన్నికల సమయంలో ‘కూటమి’లో సీట్ల సర్దుబాటు ఆఖరి వరకు కొలిక్కి రాకపోవడంతో ఉత్కంఠగా మారింది. మొత్తం 120 వార్డుల్లో తెదేపా 77, జనసేన 32, భాజపా 11 స్థానాల్లో పోటీ చేసేలా నిర్ణయించారు. ఈనాడు-విశాఖపట్నం: గ్రేటర్ ఎన్నికల సమయంలో ‘కూటమి’లో సీట్ల సర్దుబాటు ఆఖరి వరకు కొలిక్కి రాకపోవడంతో ఉత్కంఠగా మారింది. ఎక్కడా మనస్పర్థలకు తావివ్వకుండా కలిసి కట్టుగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్లు ఆశించి రాని కూటమి రెబల్స్ బరిలో ఉన్నా ఆఖరి ఓటు వరకు గెలుపు కోసం కూటమి కలిసి పనిచేసింది. ఫలితంగా అత్యధిక చోట్ల గెలుపు జెండా ఎగుర వేశారు.