ఉత్తరాంధ్ర రాజకీయాలకు గుండెకాయలాంటి విశాఖపట్నం.. కూటమికి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. Visakhapatnam: విశాఖలో కూటమి సునామీ | visakhapatnam-the-heart-of-north-andhra-politics-is-a-stronghold-for-the-alliance. ఈనాడు, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాలకు గుండెకాయలాంటి విశాఖపట్నం.. కూటమి అంటే విశాఖ’ అని స్పష్టంచేస్తూ ఇక్కడి ఓటర్లు చైతన్యవంతమైన రాజకీయ తీర్పునిచ్చారు. మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత గ్రేటర్లో 120 వార్డులకు ఎన్నికలు జరగ్గా కూటమి అభ్యర్థులు 98 చోట్ల జయకేతనం ఎగురవేశారు. మేయర్ అభ్యర్థిగా తెదేపాకు చెందిన ముక్కా శ్రావణి 2,44,644 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా గాలివీచినా..