మహా ఎన్నికల సమరంలో వైకాపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నగర ఓటర్లు విజన్, అభివృద్ధికే ‘జై’ అన్నారు. నాడు అధికార బలంతో, అరాచకాలతో జీవీఎంసీ పాలకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వైకాపాకు ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు కోలుకోలేని గుణపాఠం చెప్పారు. ఈనాడు-విశాఖపట్నం: మహా ఎన్నికల సమరంలో వైకాపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అత్యధిక వార్డులు కూటమి పార్టీ అభ్యర్థులకు కట్టబెట్టి ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చతికిలబడిన వైకాపా ఇంకా తేరుకోలేదని తాజా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై వైకాపా దుష్ప్రచారాలను ఓటర్లు నమ్మలేదు.