షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలని ఒకరు... పెరుగుతున్న బరువుకు కళ్లెం వేయాలని ఇంకొకరు... పొద్దున్నే ఆహ్లాదకరమైన గాలి పీల్చుకోవాలని మరొకరు... వారి నడకకు కారణాలు రకరకాలు... అయితే రాన్రాను నడక వారి జీవన గమనంలో ముఖ్య భాగమైంది. అది వారికి ఆరోగ్యాన్నే కాదు అనేక బంధాలనూ ఇచ్చింది.కండరాలకు సత్తువనే కాదు కొంగొత్త ఆలోచనలనూ ప్రోదిచేసింది. నడక వల్ల ప్రయోజనాలను అందరికీ పంచాలన్న సంకల్పం వారిలో అంకురించింది. ఉదయం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో అడుగులు వేస్తూ నడిస్తే మనసుకు ఉల్లాసం.. ఖరీదైన వ్యాయామ పరికరాల అవసరం లేకుండా, పెద్దగా ఖర్చు చేయకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గం నడక.