Hyderabad white collar jobs: నౌక్రీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం వైట్-కాలర్ ఉద్యోగాల్లో హైదరాబాద్ 15 శాతం వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. Hyderabad Job Hiring: భారతదేశంలో వైట్-కాలర్ (White-Collar) ఉద్యోగాల నియామకాలు విశేషంగా పుంజుకున్నాయి. ప్రధానంగా తయారీ (Manufacturing) మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలలో పెరిగిన డిమాండ్ కారణంగా గతేడాదితో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ విడుదల చేసిన 'నౌక్రీ జాబ్‌స్పీక్ ఇండెక్స్' (Naukri JobSpeak Index) వివరాలను మంగళవారం వెల్లడించింది.