ఎల్నినో నేపథ్యంలో హైదరాబాద్ క్యూర్ పరిధిలో భూగర్భ జలాల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం జీవో 259 జారీ చేసింది. అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వడంపై ఆంక్షలు విధించడంతోపాటు, తాగునీరు మినహా ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు 2027 జులై చివరి వరకు అమల్లో ఉంటాయి. భూగర్భ జలాల శాఖ, మున్సిపల్ కార్పొరేషన్లు, హైడ్రా, జలమండలికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.