India vs New Zealand, 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు టిమ్ సీఫర్ట్కు అవకాశం ఇచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.