సాధారణంగా సినిమా రిలీజై హిట్ అయ్యాక చిత్ర బృందానికి హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, నిర్మాతలు, బహుమతులు ఇస్తుంటారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ఇంకా తన చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. ఆ సినిమా దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన పరాశక్తి చిత్రంలో కనిపించారు శివ కార్తికేయన్.