బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అనూహ్యంగా ఈ వారం భారీ సంఖ్యలో కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అందులోనూ టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేసన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నారు? అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.