ఆంధ్రప్రదేశ్లో 13 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల కూటమి విజయం సాధించగా, అనంతపురంలో మాత్రం వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి ఓటమికి అభ్యర్థి ఎంపిక, టీడీపీ-బీజేపీ మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు కారణమయ్యాయా? మేనిఫెస్టో హామీలు కూడా ప్రభావం చూపాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో 13 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరిగితే 12కార్పొరేషన్లలో కూటమి హవా కొనసాగింది. 10 మేయర్లను టీడీపీ కైవసం చేసుకుంటే 2 సీట్లు జనసేన ఖాతాలోకి వెళ్లాయి. కానీ బీజేపీకి కేటాయించిన అనంతపురం మాత్రం చేజారియింది.