AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించేందుకు 40,679 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు.