Railway Track Blast: రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. శ్రీగంగానగర్ జిల్లాలో రైలును పేల్చేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పట్టాల కింద ఉన్న రెండు నుంచి మూడు సిమెంట్ స్లీపర్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అనూప్‌గఢ్ నుంచి బటిండాకు వెళ్తున్న రైలు ఆ ప్రాంతాన్ని దాటిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే లైన్‌లోని.