Donald Trump: అమెరికా మిత్రదేశం ఇజ్రాయిల్‌కు షాక్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర నుంచి ఇజ్రాయిల్‌కు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. అయితే, ఇజ్రాయిల్‌కు ఆయుధాల విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇతర సైనిక సహకారాన్ని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో దశాబ్ధాలగా కొనసాగుతున్న రెండు దేశాల సైనిక సంబంధాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం.