US Midterms elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ డెమోక్రటిక్ పార్టీ దూసుకుపోతోంది. చాలా చోట్ల డెమోక్రాట్లు విజయం సాధిస్తుండటంతో పాటు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లకు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ట్రంప్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. ఓహియో, జార్జియా, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.