Windows Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కిటికీలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కిటికీలను ఎప్పుడూ మూసి ఉంచడం మంచిది కాదని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. కిటికీల శుభ్రత, కర్టెన్ల ఎంపిక, సహజ కాంతి, గాలి ప్రసరణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. Windows Vastu Tips Telugu: ఇంటి నిర్మాణం, అలంకరణలో తలుపులు, కిటికీలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు, సహజ కాంతి, స్వచ్ఛమైన గాలి లోపలికి ప్రవేశించడానికి కిటికీలు ఉపయోగపడతాయి. అందుకే వాస్తు శాస్త్రంలో కిటికీల దిశ, వాటి అమరిక, వినియోగం, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.