బరువు తగ్గాలంటే గంటల తరబడి జిమ్లో గడపాలా? ఖరీదైన వ్యాయామ పరికరాలు కొనాలా? బిజీ లైఫ్లో వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతున్నవారికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ జపనీస్ వర్కౌట్ ఆసక్తి కలిగిస్తోంది. రోజుకు కేవలం నాలుగు నిమిషాలు ఈ వ్యాయామం చేస్తే చాలని, వారం రోజుల్లో ఐదు కిలోల వరకు బరువు తగ్గవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చనే విషయం చాలామందిని ఆకట్టుకుంటోంది.