నాలుగు నెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్టేట్స్ ఇస్తున్నాడు. అయితే తాజాగా తన రికవరీ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు పండు మాస్టర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఢీ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగు నెలల క్రితం విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.