ప్రతిరోజూ ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లే తింటున్నారా? కొత్తగా, రుచిగా ఏదైనా చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పాలక్ పన్నీర్ ఉత్తప్పం మంచి ఎంపిక. పాలకూరతో తయారుచేసిన పచ్చటి పిండి, పైన పన్నీర్, ఉల్లిపాయ, టమాటా టాపింగ్‌తో ఈ ఉత్తప్పం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా తినడానికి కూడా రుచిగా ఉంటుంది. పిల్లలకు టిఫిన్‌గా పెట్టడానికి కూడా ప్రయత్నించవచ్చు. సాధారణ ఉత్తప్పంలా మినప్పప్పు, బియ్యం నానబెట్టి పిండి తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే రవ్వ, పెరుగు, పాలకూరతో పిండిని సిద్ధం చేసుకోవచ్చు. పైన పన్నీర్, కూరగాయలు వేసి పెనంపై కాల్చుకుంటే వేడివేడి పాలక్ పన్నీర్ ఉత్తప్పం రెడీ.