Diwali Gift Scam Alert: దీపావళి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రముఖుల పేర్లతో రూ.8 లక్షల విలువైన గిఫ్టులు ఇస్తామంటూ నకిలీ లింకులు పంపిస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.. Diwali Gift Scam Alert: పండుగ వచ్చిందంటే చాలు.. షాపింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్టుల పేరుతో ఎన్నో ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా రూ.8 లక్షల విలువైన గిఫ్ట్ అందిస్తామంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.