బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సహజ నటన, వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవి. ఎలాంటి గ్లామర్ హంగులు లేకపోయినా, కేవలం తన నటనా ప్రతిభతోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు.