AP MPTC, ZPTC Elections 2026కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించారు. నవంబర్ 5న MPTC, ZPTC పోలింగ్ జరగనుండగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.