Vijayawada : విజయవాడ కార్పొరేషన్ లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా ముందంజలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండటంతో పాటు అతి తక్కువ ఓట్లు పోల్ కావడంతో కొంత ఆందోళన కూటమి పార్టీల్లో నెలకొంది. జనసేన నుంచి వంగవీటి రాధా, వైసీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు.తొలి నుంచి...అయితే పోస్టల్ బ్యాలెట్ నుంచి వంగవీటి రాధా ఆధిక్యతలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయిన తర్వాత అనేక వార్డుల్లోనూ జనసేన అభ్యర్థి వంగవీటి రాధా ముందంజలో ఉన్నారు. అయితే నెమ్మదిగా ఓట్ల లెక్కింపు జరుగుతుండటంతో కొంత ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది.