CM Chandrababu: ఓ వైపు తుఫాన్లు వణికిస్తే.. మరోవైపు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో హీట్ పెంచాయి.. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకే తాను తొలి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్నామని, మొదట అర్నబ్ తుపాను, ఆ వెంటనే మురసు తుపాను రావడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని వెల్లడించారు..