తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చల పురోగతిని.