Pune: మహారాష్ట్రలోని పుణెలో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని పాయల్ జాంబ్రే పాటిల్‌గా గుర్తించారు..