అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ‘భాయి దూజ్’ (Bhai Dooj). తెలుగు ప్రాంతాలలో దీనిని ‘భగిని హస్త భోజనం’ లేదా ‘యమ ద్వితీయ’ అని కూడా పిలుస్తారు. దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ముగింపు ఘట్టంగా వచ్చే ఈ పండుగను ప్రతి ఏటా కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ శుభదినాన సోదరీమణులు తమ సోదరుల నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చి,.