Hyderabad: రాష్ట్రంలో కలకలం రేపిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఏకంగా రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ ₹500 నోట్లను ముద్రిస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా రట్టు చేశాయి. ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వాహన తనిఖీల్లో దొరికిన నిందితులు అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో.