Pulivendula Election Results: మున్సిపల్ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సత్తా చాటింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూటమి ఆధిపత్యం ప్రదర్శించగా, వైసీపీ ఎక్కడా చెప్పుకోదగ్గ ఆధిక్యత కనబరచలేకపోయింది. నామినేషన్ల ప్రక్రియలోనే ఆరు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకోగా, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ విజయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటివరకు పులివెందులలో ఆ పార్టీ గెలుపొందలేదు. తొలిసారిగా కూటమి విజయం.