‘అర్నబ్’ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామ సమీపంలో లారీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇసుక గెడ్డ కల్వర్టు దాటుతుండగా నీటి ఉధృతికి లారీ పడవలా తేలిపోయింది. డ్రైవర్ సూర్యప్రకాశ్ చెట్టును ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రవాహం తగ్గిన తర్వాత ఒడ్డుకు చేరుకుని ప్రమాదాన్ని తెలియజేశాడు. ఘటన నేపథ్యంలో అధికారులు కల్వర్టుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ‘అర్నబ్’ తుఫాను ధాటికి కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం సమీపంలో ఓ దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది.