విజయవాడ , విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి, నవంబర్ 3: విజయవాడ, విశాఖపట్నం (జీవీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణకై మేయర్, సభ్యులకు నవంబర్ 4న ఆయా జిల్లాల కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటీసులు అందజేయనున్నారు. నవంబర్ 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.