ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ఓటీపీ ధృవీకరణ నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది ప్రభుత్వం. తుఫాన్ క్రమంలో మొబైల్ టవర్లలో సాంకేతిక సమస్యలు, మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో ఓటీపీలను అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఓటీపీ నిబంధనను తొలగించింది. అర్నబ్, మురసు వంటి వరుస తుఫాన్ల క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించింది. పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితుల క్రమంలో గతంలో గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఓటీపీని తప్పనిసరి చేశాయి.