రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాప్తాడు బాలికపై రంపంతో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ కుడి కాలిని తొలగించారు వైద్యులు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా వారిపై కత్తితో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసిన హేమంత్పై పోలీసులు కాల్పులు జరపగా.. అతని కుడికాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్కు తరలించగా.. కుడి పూర్తిగా చిత్రమైపోయిందని.. ఆ కాలికి రక్త సరఫరా పూర్తి నిలిచిపోయిందని వైద్యులు తేల్చారు. దీంతో ఆపరేషన్ చేసి కాళు తొలగించినట్టు వైద్యులు తెలిపారు. మరో కాలికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని..