హైదరాబాద్ మెట్రో రెండో దశకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. దీంతో మెట్రోపై మరో ముందడుగు పడినట్లయింది. కేంద్రం ఇప్పటికే మెట్రో సేకండ్ ఫేజ్‌కు ఆమోదం ఇవ్వగా.. ఇప్పుడు నిధులు కూడా విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చేసింది. మెట్రో సెకండ్ ఫేజ్ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఎల్అండ్టీ సంస్థ నుంచి మెట్రోను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా.. ఈ క్రమంలో రెండో విడత ప్రాజెక్టును షురూ చేసింది. ఇప్పటికే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అందించగా..