ఆంధ్రప్రదేశ్లో 92 పురపాలికలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో 6,831 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మురసు తుఫాన్ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ ఆలస్యం కానుంది. రీపోలింగ్ తర్వాత రాష్ట్రంలో 62.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల మురసు తుఫాన్ ప్రభావంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది.. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్ ను సిద్ధం చేశారు.