ఆహార నియమాల పట్ల శ్రద్ధ పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, చదువుకున్న వారిలో తెల్ల బియ్యం వాడకం తగ్గి, బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ ధాన్యాలు, కొర్రలు, అరికెలు వంటి మిల్లెట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి మిల్లెట్స్ బియ్యం కంటే ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, బియ్యం తినే అలవాటుకు తిరిగి వస్తున్న వారికి ముడిబియ్యం, ముఖ్యంగా ఎర్ర బియ్యం ఒక అద్భుతమైన ఎంపిక. బ్రౌన్ రైస్ కంటే ఎర్ర బియ్యం మరింత మంచిది.