US Iran Conflict: ఇరాన్‌కు చెందిన కిషమ్ (Qeshm) దీవిపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై గుట్టుచప్పుడు కాకుండా చిన్నపాటి దాడులు చేస్తూ వస్తున్న అమెరికా, ఈసారి ఏకంగా కిషమ్ దీవిని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి తెగబడింది. అమెరికాలో మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయాన్ని అనువుగా తీసుకుని, ఎన్నికలు ముగియగానే ఇరాన్‌పై మరో పెద్ద దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ దాడి జరగడానికి కొద్ది గంటల ముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.