విశాఖపట్నం HPCL రిఫైనరీ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఫైనరీలోని ఓ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. .. దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం HPCL రిఫైనరీ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఫైనరీలోని పిచ్ టవర్ యూనిట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు క్షణాల్లోనే పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించాయి. నల్లని పొగలు, ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పొగలు అలముకోవడంతో పరిసర ప్రాంతాల నివాసితులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.