విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. HPCL Visakhapatnam: విశాఖ హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన స్థానికులు | fire-accident-in-visakhapatnam-hpcl-refinery. విశాఖ: విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న హెచ్పీసీఎల్ సేఫ్టీ వింగ్ సిబ్బంది పరిస్థితిపై ఆరా తీశారు. పేలుడు జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సంస్థ అధికారులు ఆరా తీస్తున్నారు.