బియ్యం అక్రమ వ్యాపారంపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంది. హైదరాబాద్, నవంబర్ 2: బియ్యం అక్రమ వ్యాపారంపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఈటీఎఫ్, లీగల్ మెట్రాలజీ సంయుక్త తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో 25 కిలోల బియ్యం బస్తాపై 26 కిలోల లేబుల్ వేసి మోసాలకు పాల్పడిన వ్యాపారులను గుర్తించాయి.ఈ తనిఖీల్లో అడ్డదారుల్లో సాగుతున్న వ్యాపారాలు బయటపడ్డాయి. కొందరు వ్యాపారులు ఎమ్మార్పీపై అధిక ధరల స్టిక్కర్లు వేసి బియ్యం బస్తాలు విక్రయిస్తున్నారు.