హైదరాబాద్ నగరానికి సమీపంలోని శివార్ల ప్రాంతాల్లో అక్రమంగా భూగర్భ జలాలను ఉపయోగిస్తున్న నీటి వ్యాపారంపై హైడ్రా (hydraa) కఠిన చర్యలు తీసుకుంటోంది. అనుమతులు లేకుండా. అనుమతులు లేకుండా బోర్లు వేసి, వాటిని ట్యాంకర్ల ద్వారా అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, తెల్లాపూర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 7 అక్రమ బోర్వెల్లను పైపులతో సహా తొలగించి, వాటిని పూర్తిగా పూడ్చివేశారు. ఈ చర్యలతో పాటు, నీటి నిల్వ కోసం నిర్మించిన 6 భారీ వాటర్ సంపులను కూడా అధికారులు ధ్వంసం చేశారు.