గత వారమే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మూఢ నమ్మకాలు, చేతబడులు, తంత్ర విద్యల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. అందుకే ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు రీచ్ ఎక్కువ. ముఖ్యంగా ఓటీటీలోఈ జానర్ సినిమాలను భాషతో సంబంధం లేకుండా తెగ చూసేస్తుంటారు ఆడియెన్స్. అలా గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది.