ఇడ్లీలు, దోశెలు తయారు చేసుకోవాలంటే ముందుగా పిండిని సిద్ధం చేసుకుని పులియబెట్టడం చాలా ముఖ్యం. అయితే చలికాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఒక్కటే.. ఎంతసేపు ఉంచినా ఇడ్లీ పిండి సరిగా పులియదు. దీంతో ఇడ్లీలు గట్టిగా రావడం, దోశెలు ఆశించినంత రుచిగా లేకపోవడం జరుగుతుంది. కొందరు ఈ సమస్యను అధిగమించడానికి ఎనో లేదా వంట సోడా కలుపుతుంటారు. కానీ సహజ పద్ధతిలోనే పిండిని పులియబెట్టుకునే మార్గాలు కూడా ఉన్నాయి.