Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్లడీ రోమియో’. తాజాగా ఈ చిత్ర బృందానికి ఊహించని తలనొప్పి ఎదురైంది. షూటింగ్ లొకేషన్ నుంచి ఏకంగా కీలక సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఢిల్లీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.