హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.