బియ్యం ధరల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. కృత్రిమ కొరత సృష్టించడం, బస్తాల బరువులో తేడాలు చూపించడం, అసలు ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ (ETF), లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. అక్టోబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల.