బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పల్నాడు, బాపట్ల, నెల్లూరుతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు ముందస్తు సెలవు ప్రకటించారు. నెల్లూరు – నరసాపురం.